2 March, 2026 | 6:12 AM

ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేద కుటుంబాలకు అండగా ప్రజా ప్రభుత్వం

02-03-2026 02:16 AM
  1. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు 

ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారులు దూసా హరిత వేణు

బోయినపల్లి: మార్చి 1(విజయ క్రాంతి): నిరుపేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు సొంత ఇల్లు అనేది ఒక కళ ,ఆ కళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వల్ల నా యొక్క కళ నెరవేరిందని దూస హరిత వేణు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కాగా, ఆదివారం రోజు గృహ ప్రవేశం చేశారు.

ఈ సందర్భంగా ఈ గృహప్రవేశ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ పిట్టల మోహన్, కాంగ్రెస్ నాయకులు దూస జనార్దన్, మహేందర్ గుంటి జలందర్, నల్లగొండ శ్రీనివాస్ ,ఆనంతుల సాయి,గుంటి తిరుపతి మరియు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. లబ్ధిదారు రాలు ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.