ఆరని కన్నీరు.. అందని న్యాయం!
* ‘అయ్యా.. మా ఆయన రేపు ఊరొస్తాడనుకున్నాం. కానీ పెట్టెలో కనీసం గుర్తుపట్టడానికి ముఖం కూడా లేని బూడిద ముద్దనొదిలారు. ఇప్పుడు నలుగురు పిల్లలను పట్టుకుని నేనెక్కడకు వెళ్లాలి?’ ఇది సిగాచి ప్రమాదంలో చనిపోయిన ఒక ఒడిశా వలస కార్మికుడి భార్య రోధన. ఈమెది మాత్రమే కాదు.. ఆ నిప్పుల కొలిమిలో సర్వస్వం కోల్పోయిన 54 కుటుంబాల గుండెకోత.
రెక్కాడితేగాని డొక్కాడని ఆ పేద బతుకులు.. స్వగ్రామాల్లో కరవు కోరల నుంచి తప్పించుకుని, నాలుగు పైసలు సంపాదించి పిల్లలను చదివించుకుందామని వేల కిలోమీటర్ల దూరం నుంచి పాశమైలారం వచ్చారు. రూపాయి రూపాయి కూడబెట్టి సొంత ఊరిలో చిన్న ఇల్లు కట్టుకోవాలని కలలు గన్నారు. కానీ యాజమాన్యం నిర్లక్ష్యం అనే రాక్షస జ్వాల వారి ఆశలను, ఆశయాలను క్షణాల వ్యవధిలో బూడిద చేసింది. ప్రమాదం జరిగి ఏడాది గడిచినా, ఆయా ఇళ్లల్లో ఇంకా పొయ్యి వెలగని పరిస్థితి.
చనిపోయిన భర్తల జ్ఞాపకాలతో భార్యలు, తండ్రి లేడనే చేదు నిజాన్ని అంగీకరించలేని పసిపిల్లలు, వృద్ధాప్యంలో ఆసరా కోల్పోయిన తల్లిదండ్రులు.. నేటికీ కన్నీరు మున్నీరవుతున్నారు. ఒకవైపు గుండెకోత మిగిల్చిన బాధ.. మరోవైపు ప్రకటించిన పరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన దైన్యం. చట్టాలు, జీతాలు, లాభాలు, నష్టాల లెక్కల కంటే.. ఆ నిరుపేద కుటుంబాల జీవితాల్లో నిండిన ఈ చీకటిని ఏ పరిహారం తుడవగలదు?
ఏ కోటి రూపాయలు వారి ప్రాణాలను తిరిగివ్వగలవు? ఎ.చంద్రశేఖర్ రావు
- పాశమైలారం ‘సిగాచి’ ఘోరకలికి ఏడాది
- గూడు కూలి.. కూలీల బతుకులు బూడిదై..
- సజీవ శవాలుగా మారిన కార్మికులు
- యాజమాన్య లాభాల వేటకు 54 మంది బలి!
- కోర్టు మెట్లెక్కిన రూ.కోటి పరిహారం హామీ
- సీలింగ్ మెషిన్ నిర్లక్ష్యమే కారణమన్న సాంకేతిక కమిటీ
- బెయిల్‌పై తిరుగుతున్న సీఈఓ, పరారీలో డైరెక్టర్లు..
- నేడు బీఆర్‌ఎస్, ప్రజా సంఘాల నిరసన
సంగారెడ్డి, జూన్ 29 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫార్మా ప్లాంట్‌లో సంభవించిన భీకర పేలుడు, అగ్నిప్రమాదం జరిగి జూన్ 30 నాటికి సరిగ్గా ఏడాది ముగిసింది. ఈ ఘోర పారిశ్రామిక దురంతంలో 54 మంది కార్మికులు సజీవ దహనమవ్వగా, మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశాన్ని సైతం కుదిపేసిన ఈ ఘోర ప్రమాదం జరిగి ఏడాది గడుస్తున్నా, బాధిత కుటుంబాల కన్నీళ్లు ఇంకా ఆరలేదు.
అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యం ఇచ్చి న భారీ పరిహారం, ఉపాధి హామీలు నేటికీ కాగితాలకే పరిమితం కాగా, బాధితులకు పూ ర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. గతేడాది జూన్ 30న ఉదయం 9 గంటల ప్రాంతం లో సిగాచి పరిశ్రమలో ఒక్కసారిగా భీకర పేలుడు సంభవించింది. నాటి భీకర ధాటికి మూడు అంతస్తుల ఫ్యాక్టరీ భవనం పూర్తిగా కుప్పకూలి శిథిలాల కుప్పగా మారింది. ప్ర మాద సమయంలో బిల్డింగులో 140 మం దికి పైగా కార్మికులు విధులు నిర్వహిస్తున్నా రు.
శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుల మృ తదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే, దాదా పు 16 మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉండటంతో కొన్ని వారాల పాటు కొనసాగిన డీఎన్‌ఏ పరీక్షల అనంతరం గానీ మృ తులెవరో గుర్తించలేని దారుణమైన పరిస్థితి నెలకొంది. మృతుల్లో ఎక్కువ శాతం ఒడిశా, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పేద వలస కార్మికులే.
సాంకేతిక కమిటీ దర్యాప్తులో తేలిన ఘోర తప్పిదాలు
ప్రమాదం మొదట రియాక్టర్ పేలుడు వల్లే జరిగిందని ప్రచారం జరిగినప్పటికీ, ప్ర భుత్వ సాంకేతిక నిపుణుల కమిటీ దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. కంపెనీ లాభాల కోసం, ఉత్పత్తిని విపరీతంగా పెంచే తొందరలో కనీస అవగాహన, శిక్షణ లేని కాంట్రాక్ట్ వలస కార్మికులతో ఓవర్‌టైమ్ పనులు చేయించింది.
స్ప్రే డ్రైయర్ కాకుండా సీలింగ్ యంత్రం వద్దే పేలుడు మూలాలున్నట్లు కమిటీ గుర్తించింది. ప్యాకిం గ్ ప్రాంతంలో మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ (ఎంసీసీ) యొక్క లూజ్ ధూళి మే ఘంలా పేరుకుపోయింది. సీలింగ్ ఆపరేషన్ సమయంలో ప్లాస్టిక్ సంచులు ప్రమాదవశాత్తు కాలిపోవడంతో మంటలు చెలరేగి, దట్టమైన ధూళి కారణంగా అది ‘డస్ట్ ఎక్స్‌ప్లోజన్’గా మారి భవనాన్ని కుప్పకూల్చింది.
నీటిమూటగా రూ.కోటి మాట
ప్రమాదం జరిగిన మరుసటి రోజే (జూలై 1న) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ తదితరులతో కలి సి ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతు ల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, చిన్నపాటి గాయాలైన వారికి రూ.5 లక్షల చొప్పున సహాయం అందిస్తామని ప్రకటించారు. సిగాచి యాజమాన్యం కూడా తా ము రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని అధికారికంగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. కానీ ఏడాది తిరిగేసరికి ఆ మాట నీటిమూటగా మారింది.
చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం కేవలం రూ.42 లక్షలు మా త్రమే ఇస్తామంటూ యాజమా న్యం హైకోర్టును ఆశ్రయించింది. పోస్ట్ డేటె డ్ చెక్కులు ఇవ్వడం, పరిహారం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేయడంతో వలస కార్మికుల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. దీనిపై ప్రస్తు తం కోర్టులో పిల్ నడుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఉపాధి, వైద్య, విద్యా సహా యాల హామీలు కూడా నేటికీ నెరవేరలేదు.
బెయిల్‌పై యాజమాన్యం.. బాధితులు బేజారు
ప్రమాదం జరిగిన ఆరు నెలల పాటు కాలయాపన చేసిన పోలీసులు, తీవ్ర ప్రజా ఒత్తిడి అనంతరం డిసెంబరులో కంపెనీ ఎం డీ, సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను అరెస్ట్ చేశా రు. అయితే ఆయన కూడా కొన్ని వారాల్లోనే హైకోర్టు నుంచి బెయిల్ పొంది బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కాగా కేసులో నిందితులుగా ఉన్న మిగిలిన ఐదుగురు డైరెక్టర్లు ఇంకా పరారీలోనే ఉండటం పోలీసుల దర్యాప్తు తీరుకు అద్దం పడుతోంది.
ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్
సిగాచి మొదటి వర్ధంతి సందర్భంగా తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమి టీ, హ్యూమన్ రైట్స్ ఫోరమ్, సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ వంటి పౌర సమాజ సంస్థలు ఆగ్ర హం వ్యక్తం చేశాయి. కంపెనీ యాజమాన్యం కోర్టుల చుట్టూ తిప్పుతూ బాధితులను మో సం చేస్తోందని, ప్రభుత్వం వెంటనే రెవెన్యూ రికవరీ చట్టం కింద సిగాచి ఇండస్ట్రీస్ ఆస్తులను జప్తు చేసి బాధితులకు పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి.
దీనికి నిరసనగా జూన్ 30న బ్లాస్ట్ సైట్ వద్ద భారీ నిరసన ప్రదర్శనను కూడా చేపట్టనున్నాయి. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవాం నాడు స్మరరణ సభ చేపడుతున్నట్లు పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్‌గౌడ్ విజయక్రాంతికి తెలిపారు.
పాలకులారా.. ఇకనైనా కళ్లు తెరవండి
సిగాచి దురంతం జరిగి ఏడాది పూర్తయినా పారిశ్రామిక వాడల్లో భద్రతా తనిఖీ లు మెరుగుపడలేదు. కేవలం లాభాల కోస మే ప్రాణాలను పణంగా పెడుతున్న ఫార్మా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిగాచి బాధితులకు ప్రకటించిన పూర్తి పరిహారం అందేలా చూడాలని, పారిశ్రామిక భద్రతా చట్టాలను కఠినతరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రాణం మిగిలింది.. బతుకు శవమైంది
‘చనిపోయిన వాళ్లు ఒకేసారి కాలిపోయారు.. కానీ నాలాంటి వాళ్లు రోజురోజు కూ నరకం చూస్తూ చస్తున్నారు. చేతులు పనిచేయవు.. నడవలేను.. మందులు కొనడానికి పైసల్లేవు.. నన్ను చూసి నా పిల్లలు ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నా.. ఇది సిగాచి ప్రమాదంలో 60 శాతం కాలిన గా యాలతో ప్రాణాలతో బయటపడిన జా ర్ఖండ్కు చెందిన ముప్పు ఏళ్ల వలస కార్మికుడి (పేరు పెట్టలేదు) కన్నీటి ఆవేదన. ఆ రోజు జరిగిన భీకర పేలుడులో అతను ప్రాణాలు తృటిలో తప్పించుకున్నాయి.
కానీ ఆ నిప్పుల జ్వాలలు అతని జీవితాన్ని శాశ్వతంగా అంధకారం చేశాయి. రెండు చేతుల వేళ్లు పూర్తిగా కాలిపోయి ముడుచుకుపోయాయి. ముఖం, ఛాతి భాగం గుర్తుపట్టలేనంతగా వికృతమయ్యాయి. ప్రమాదం జరిగి ఏడాది గడుస్తున్నా.. కనీ సం తన చేత్తో తను అన్నం తినలేని, మం చం నుండి లేవలేని పక్షవాతం లాంటి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రమా దం జరిగిన కొత్తలో కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించి యాజమాన్యం చేతులు దులుపుకుంది.
డిశ్చార్జ్ అయిన తర్వాత అవసరమైన ప్లాస్టిక్ సర్జరీలు, నిరంతర ఫిజియోథెరపీ ఖర్చులను పూర్తిగా గాలికి వదిలేసింది. ప్రభుత్వం ఇస్తామన్న రూ. 10 లక్షల సాయం ఇప్పటికీ పూర్తిస్థాయి లో అందలేదు. నెలకు మందుల కోసమే ఐదారు వేల రూపాయలు ఖర్చవుతుండటంతో, అప్పులు చేసి కుటుంబం రోడ్డున పడింది. సదరు బాధితునిలాగే మరో 28 మంది తీవ్రంగా గాయపడిన కార్మికుల పరిస్థితి నిత్యం నరకప్రాయంగా మారింది. కొందరికి చూపు మందగించగా, మరికొందరు ఊపిరితిత్తుల సమస్యలతో బాధప డుతున్నారు.
అయితే గాయాలపాలైన కొందరు కార్మికులు బతకడం కోసం కం పెనీకి వెళ్తున్నప్పటికీ గతనెల నుండి వారిని కూడా తొలగిస్తున్నట్లు యాజమా న్యం ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఒకప్పుడు కుటుంబానికి ఆ సరాగా నిలిచిన చేతులే.. ఈరోజు ఆ కు టుంబానికి భారంగా మారాయి. చనిపోయిన వారికి పరిహారం కోసం పోరాటం జరుగుతోంది, కానీ బతికుండి ప్రతిరోజూ చస్తున్న ఈ ’సజీవ శవాల’ గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.






