నేటి నుంచి రైతు భరోసా
- శిల్పారామంలో పంపిణీ సదస్సు
- వర్షాల వల్ల మధిర నుంచి హైదరాబాద్‌కు మారిన రైతు ఆశీర్వాద సభ
- నేడు రెండు ఎకరాల వరకు 41.37 లక్షల మందికి..
రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమచేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
రైతులు, ప్రజాప్రతినిధులు వీక్షించేలా రైతు వేదికల వద్ద డిజిటల్ స్క్రీన్లు
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జగన్నాథపురంలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ రద్దయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయకుండా, ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.
ఈ సభను రైతు భరోసా పంపిణీ సదస్సుగా నిర్వహించనున్నారు. శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలోని రైతులు తమ పరిసర ప్రాంతాల్లోని రైతు వేదికల నుంచి డిజిటల్ లేదా వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొనేలా అ ధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, ఈ రైతు భరోసా పంపిణీ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.32 లక్షల మంది రైతులకు, కోటి 50 లక్షల ఎకరాలకు గాను ఎకరాకు రూ. 6 వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు దశలవారీగా ప్రభుత్వం జమ చేయనున్నది. పె ట్టుబడి సాయం పంపిణీకి రూ.9 వేల కోట్లు జూలై 15 లోపు రైతులందరికీ పూర్తిగా జమ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
మొదటి విడతలో రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతులకు రూ.2,482. 02 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. ఈ తొలి విడతలో ఒక ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతుల కోసం రూ. 878.94 కోట్లు, రెండు ఎకరాల వరకు భూ మి కలిగిన 26.72 లక్షల మంది రైతుల కోసం రూ.1,603.08 కోట్లను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నారు.
కొత్తగా పాసుబుక్‌లు వస్తే జూలై 5లోపు దరఖాస్తు చేసుకోవాలి: మంత్రి తుమ్మల
తొలివిడతలో రైతు భరోసా విడుదల చేసిన తర్వాత, మిగిలిన రైతులకు కూడా దశ ల వారిగా రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అదేవిధంగా కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జూలై 5 లోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి బ్యాంకు అకౌంట్ వివరాలు సమర్పించినట్లయితే వా రు కూడా రైతు భరోసా పొందే అవకాశం ఉంటుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవ సాయ అనుబంధ శాఖల అధికారులు సమీప రైతు వేదికలకు చేరుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెద్ద ఎ త్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భారీ వర్షాల కారణంగానే వేదిక మార్పు జరిగిందని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి 2,500 మంది రైతులు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.






