2 March, 2026 | 6:11 AM

ఓదెల మల్లికార్జునస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

02-03-2026 02:17 AM

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు 

సుల్తానాబాద్, మార్చి 1 (విజయక్రాంతి):ఓదెల శ్రీ.మల్లికార్జున స్వామి ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఓదెల మల్లికార్జున స్వామిని వేడుకోవడం జరిగిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, ఆదివారం పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామిని ఎమ్మెల్యే విజయ రమణారావు పావని దంపతులు, కుటుంబ సపరివార సమేతంగా తమ ఇంటి ఇలవేల్పు అయిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు, ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు..

తదుపరి బోనాలు సమర్పించుకొని ,పట్నాలు వేసి స్వామివారిని కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే  కొలిచారు...అనంతరం ఆలయ కమిటీ పక్షాన మెమొంటోలు స్వామివారి కండువాలతో ఎమ్మెల్యే విజయరమణా రావు ని వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈవో సదయ్య, డైరెక్టర్లు కట్కూరి సమ్మిరెడ్డి , కొండ శ్రీనివాస్, జంగం కొమురయ్య, ఉప్పుల శ్రావణ్ కుమార్, తాళ్లపల్లి శ్రీనివాస్, గంట రమేష్, జీలక రవి, మనోహర్ రావు, సామల యమున హరికృష్ణ , ఈరవేణి రవి, తీర్తాల రాజారామ్, ప్రధాన అర్చకులు ధూపం వీరభద్రయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రావు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.