ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, జూన్ 29 (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమాల్లో వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు.
వానాకాలం వన మహోత్సవమునకు శాఖల వారీగా టార్గెట్స్ పూర్తి చేయాలని ప్రతి శాఖల అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు ప్రత్యేక దృష్టితో శాఖల వారీగా అధికారులు పూర్తిచేయాలన్నారు. ప్రజా పాలన - కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వాడకం పై అవగాహన కల్పించడంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ బాగా కృషి చేశారని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
ప్రతి కాలేజీ, స్కూళ్లలో డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని అలాగే రోడ్డు భద్రత గురించి సంక్షేమ హాస్టల్స్ లో, కాలేజీ, పాఠశాలలో అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు రోడ్డు భద్రతపై సూచనలు చేయాలని, ఎన్ హెచ్ 65, కుడకుడ రోడ్డులో అక్కడక్కడ రోడ్డు పాడైపోయి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నందు వలన ఎన్ హెచ్ -65 అధికారులు, మున్సిపల్ ఇంజనీర్ సిబ్బంది సంబంధిత కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలన్నారు.
పాత ప్రజావాణి పోర్టల్లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలకి సంబందించి 53 దరఖాస్తులు, డిడబ్ల్యుఓ 9, డిఇఓ 5, డీపీఓ 3, వివిధ శాఖలకి చెందినవని 28 రాగా మొత్తం 98 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డిఆర్‌ఓ ప్రేమ్ రాజు, డిఆర్డిఓ పిడి సన్యాసయ్య, జడ్పీ సీఈఓ శిరీష, డిఎంహెచ్‌ఓ వెంకటరమణ, పిడి హౌసింగ్ సిద్ధార్థ్, సిపిఓ కిషన్ నాయక్, డిఇఓ అశోక్, సి పి ఓ కిషన్ నాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.






