విద్యార్థులకు అండగా ఉంటాం..-సమస్యలు పరిష్కరిస్తాం
మోడల్ స్కూల్‌లో బోర్ వెల్ పనులు,నూతన కిచెన్ షెడ్డులను ప్రారంభించిన మంత్రి అడ్లూరి
ధర్మపురి,జూలై21(ధర్మపురి):విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సమస్య లు పరిష్కరిస్తామనీ తెలంగాణ రాష్ట్ర సంక్షే మ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పే ర్కొన్నారు. వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి మోడల్ స్కూల్ లో ఆయన మంగళవారం పర్యటించారు. విద్యార్థుల సమస్యలను ఆ యన నేరుగా తెలుసుకున్నారు. కుమ్మరిపల్లె మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని మో డల్ స్కూల్ ఉపాధ్యాయులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మంత్రి విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి బోర్వెల్ తవ్వకా లకు భూమిపూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
అనంతరం రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్ను ప్రారంభించి విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాలలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని మం త్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పం దించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాపెల్లి శేఖర్, ఎంపీడీవో పాడి వెంకట్ ప్రసాద్, ఎస్త్స్ర పులిచెర్ల ఉదయ్ కుమార్,పాఠశాల ప్రిన్సిపాల్ సందీప్ రాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గండ్ర శ్రీకాంత్ రావు, ఏఎంసీ చైర్మెన్ గోళ్ల తిరుపతి, వెల్గటూర్ మాజీ సర్పంచ్ మేరుగు మురళి గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి,ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు గండ్ర ప్రతాప్ రావు, నాయకులు బందెల ఉదయ్ గౌడ్, నక్క సురేష్, గుమ్ము ల అజయ్, తదితరులు పాల్గొన్నారు.






