28 February, 2026 | 4:40 AM

రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తాం..

28-02-2026 01:10 AM

ములుగు, ఫిబ్రవరి27 (విజయక్రాంతి): ములుగు జిల్లా సివిల్ సప్లైస్ డీఎంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కృష్ణవేణిని శుక్రవారం ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆమెకు పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మాట్లాడుతూ.. జిల్లాలోని రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా పెండింగ్లో ఉన్న మిల్లింగ్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బార్ధాన్ (గన్నీ బ్యాగుల) లెక్కలు, ధాన్యం మిల్లింగ్కు సంబంధించిన పరిపాలనా ఇబ్బందులు, చెల్లింపుల ఆలస్యం, రవాణా మరియు నిల్వ సమస్యలపై కూడా వివరించారు. దీనిపై స్పందించిన డీఎం కృష్ణవేణి సమస్యలను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.