28 February, 2026 | 3:03 AM

కవిత ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది

28-02-2026 01:10 AM

రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కితాబు 

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని, ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం అభినందనీయమని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కితాబు ఇచ్చారు. కోదండరెడ్డితో కవిత శుక్రవారం రైతు కమిషన్ కార్యాలయంలో భేటీ అయ్యారు. గద్వాల జిల్లాలో పత్తి విత్తనోత్పత్తి చేసిన రైతుల బకాయిల చెల్లింపుల అంశాన్ని కమిషన్ దృష్టికి కవిత తీసుకెళ్లారు.

10 వేల మంది రైతులకు విత్తన కంపెనీలు రూ.200 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని చెప్పా రు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా కవిత వివరించారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి స్పందిస్తూ  గద్వా ల జిల్లాలో పత్తి విత్తనాలు ఏళ్లతరబడి ఉత్ప త్తి చేస్తున్నారని, ఈ సమస్య కమిషన్ దృష్టికి రాగానే.. కలెక్టర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను పరిష్కరించా మని కవితకు కోదండరెడ్డి తెలిపారు.

విత్తన కంపెనీలు పెట్టిన బకాయిల అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేం దుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిచన చట్టాలు రైతులకు ఇబ్బందిగా ఉన్నాయని, కేంద్ర విత్తన చట్టం దారుణంగా ఉందని కోదండరెడ్డి తెలిపారు. యూరియా యాప్ విషయం లో కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.