29 May, 2026 | 4:21 AM

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

29-05-2026 02:24 AM
  1. అదనంగా లారీలను సమకూర్చుతున్నాం
  2. మంత్రి వివేక్ వెంకట స్వామి

చెన్నూర్, మే 28 : నియోజక వర్గంలోని చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. గురు వారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మండలంలోని బావురావుపేట ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పంట దిగుబడి ఎక్కువ వచ్చిందని, ఇప్పటి వరకు లక్షా 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. జూన్ 6వ తేదీ వరకు కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ధైర్యంగా ఉండాలన్నారు.

రైతుల కోసం పెద్దపల్లి జిల్లాలో మూడు గోదాములను అలాట్మెంట్ చేయించామని, హామలీల కొరతతో కొంచెం ఆలస్యం జరిగిందని, ఇక ఆ సమస్య ఉండదని, సింగరేణి సంస్థ నుంచి 40 లారీలు, మైనింగ్ శాఖకు చెందిన 45 లారీలను ధాన్యం తరలించేందుకు కేటాయించామని, 85 లారీల ద్వారా త్వరలోనే రైతుల ధాన్యం మిల్లులకు తరలిస్తామన్నారు. కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరుగుతుంటే బీఆర్‌ఎస్ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారనీ, పార్టీలకు అతీతంగా రైతులకు భరోసా కల్పించకుండా ఆందోళనలు చేసేలా రెచ్చగొడుతున్నారని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తే, చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు.

బీ ఆర్ ఎస్ హయాంలో మిల్లుల ముందు వందల లారీలు నిలిచిపోయేవని, ఇప్పుడు అలా ఏం లేదన్నారు. బాల్క సుమన్ చేసిన చట్ట వ్యతిరేఖ వ్యాఖ్యలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని, సుమన్ అరెస్టయితే జైలుకు వెళ్లి పరామర్శించిన కేటీఆర్, బాల్క సుమన్ చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వీరి వెంట డీసీసీ అధ్యక్షుడు రఘునాథ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.