దేశ విద్యావ్యవస్థ.. ఆర్‌ఎస్‌ఎస్ చెరలో!
విద్యార్థులపై పెల్లెట్ గన్ల ప్రయోగానికి అమిత్‌షాదే బాధ్యత
- ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం
- మోదీ సర్కార్‌కు ఇది మేల్కొలుపు
- ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ
ఢిల్లీ, జూలై 25 (విజయక్రాంతి): మన విద్యా వ్యవస్థ ఎంతో గొప్పదని ప్రపంచమంతా పేరున్నా.. కొన్నేళ్లుగా అది దాడు లకు గురవుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) దొడ్డిదారిన చొరబడి విద్యా వ్యవస్థను చెరబట్టి నాశనం చేస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. ఇందులో ప్రధాని మోదీ తప్పు ఎంత ఉందో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర కూడా అంతే ఉందని రాహుల్ ఆరోపించారు.
దేశంలో నిరుద్యోగం పెరగడంతో యువత ఆగ్రహంతో ఉందని, విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని కోరుకుంటుందన్నారు. శనివారం సా యంత్రం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయంగా పేర్కొన్నారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై హింస, పెల్లెట్‌గన్‌ల ప్రయోగం వంటి ఘటనలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశంతోనే జరిగాయని, అందుకు ఆయనే బాధ్యులని ఆరోపించారు.
దేశ భవిష్యత్తు గా ఉన్న విద్యార్థులపై మన బలగాలే కాల్పులు జరపడాన్ని అంగీకరించబోమని రాహుల్ తేల్చిచెప్పారు. విద్యార్థులపై అణిచివేతపై, అమిత్ షా వైఖరిని పార్లమెంటులో ప్రశ్నిస్తామని తెలిపారు. ప్రధాన్ రాజీనా మా.. అవినీతికి, విద్యా వ్యవస్థ విధ్వంసా నికి ప్రతీక అని, ఆయన తప్పుకోవడం మం చిదేనన్నారు. విద్యార్థుల డిమాండ్లు ఇంకా పూర్తిగా నెరవేరలేదన్నారు. విద్యార్థులపై దాడిచేసిన వ్యక్తులు, అమలుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
‘ఇది భారత విద్యార్థుల నుంచి, ప్రతిపక్షం నుంచి వస్తున్న వార్నింగ్. ఇప్పటి వర కు మీరు దేశాన్ని నడిపిన తీరులోనే ఇకపై నడపలేరు. ఇది మీ వ్యక్తిగత అంశం కాదు. ఇది మీ సొంత ఆస్తి కాదు. ఈ దేశం భారత ప్రజలది. భారత రాజ్యాంగానిది’ అని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్‌ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులకు రాహుల్ అభినందనలు తెలిపారు. వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
విద్యార్థుల విజయం మోదీ సర్కార్‌కు మేలుకొలుపు అని, భారతీయ విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇకనైనా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పరీక్షల వ్యవస్థలో మా ర్పులు చేస్తూ తీసుకొచ్చే బిల్లులపై విపక్షాల తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. దేశంలో ఉద్యోగాల సృష్టి, విద్యా వ్యవస్థ, సంస్థలు, మీడియా వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. దీనివల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
తప్పు చేస్తే తలవంచాల్సిందే
విద్యా వ్యవస్థను సరిదిద్దడం కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ధైర్యంగా పోరాడారు. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎన్నో కుటుంబాలు తమ పిల్లలను కోల్పోయాయి. యువత తరఫున ప్రతిపక్షాలు పార్లమెంట్ అధికార పక్షాన్ని ప్రశ్నించి విజయం సా ధించాయి. ఏ ప్రభుత్వమైనా తప్పు జరిగితే ప్రజల ముందు తలవంచాల్సిందే.
- ఏఐసీసీ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గే






