గ్రామ అభివృద్ధికి రూ.4కోట్లు
మాటనిలబెట్టుకున్న ఎమ్మెల్యే మురళీ నాయక్
మహబూబాబాద్, మే 28 (విజయక్రాంతి): మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో కనీస రహదారి సౌకర్యం లేని, మా రుమూల ఆదివాసీ గిరిజన గ్రామమైన దొరవారి తిమ్మాపురం అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్ట ర్ భూక్యా మురళి నాయక్ నాలుగు కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆ గ్రామంలో విద్యుత్ సౌకర్యం క ల్పించిన ఎమ్మెల్యే మళ్ళీ గ్రామ ప్రజల బా గోగులు తెలుసుకునేందుకు గురువారం కొంతమేర బైక్‌పై వెళ్ళి గ్రామానికి చేరుకున్నారు.
ఇల్లిల్లు తిరుగుతూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతో సమావేశ మై గ్రామస్తులు తెలిపిన సమస్యలకు వెంటనే స్పందించి రోడ్డు, చెక్ డ్యాం, బోరుబావి మరమ్మత్తు లకు హామీ ఇచ్చారు.ఈ గ్రామం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాననీ తెలిపారు. ఎమ్మెల్యే స్పందించిన తీరు, సమస్యల పరిష్కారానికి చూపిన చొరవకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. సుమారుగా రూ.4కోట్ల వ్యయంతో గ్రామ సమస్యలు త్వరలో తీరుతాయని ఎమ్మెల్యే తెలిపారు.






