26 July, 2026 | 2:11 AM

చర్చలు సఫలం

26-07-2026 01:07 AM

ఆందోళన విరమించిన సీజేపీ

  1. నిరసనకారులపై కేసుల ఉపసంహరణ
  2. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం
  3. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు కేంద్రం హామీ

 న్యూఢిల్లీ, జూలై 25 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో 36 రోజులుగా సీజేపీ సాగించిన పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్ నెరవేరడం, మిగితా డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో సంతృప్తి చెందిన సీజేపీ.. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించింది.

శనివారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర బృందం, సీజేపీ ప్రతినిధుల మధ్య మూడో దఫా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జి తేంద్రసింగ్ పాల్గొన్నారు. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా నిరసనకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని, నీట్ పేపర్ లీక్ బాధి తుల కుటుంబాలకు కోటి రూపాయల చొ ప్పున నష్టపరిహారం ఇవ్వాలని, నిరసనల్లో పాల్గొన్న ఎవ్వరినీ భవిష్యత్తులో వేధింపులకు గురిచేయెద్దని సీజేపీ డిమాండ్ చేసింది.

విద్య, పరీక్షల సంస్కరణలపై ఐదు అంశాల చార్టర్‌ను సీజేపీ కేంద్ర బృందం ముందుంచింది. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు కేం ద్రం అంగీకారం తెలిపడంతో దేశవ్యాప్త ఆం దోళనను తక్షణమే విరమించినట్లు సీజేపీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఢిల్లీలో 15 నుం చి 20 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కేం ద్రం హామీ మేరకు మూడు, నాలుగు రోజు ల్లో ఉపసంహరణ కాపీలు తమకు అందుతాయని సీజేపీ నాయకుడు దాస్ తెలిపారు.   

కేసులు ఎత్తేస్తాం : జేపీ నడ్డా

నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. ఢిల్లీతో పాటు భాజపా పాలిత రాష్ట్రాల్లో నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తామని చెప్పారు. విద్యావ్యవస్థలో, ముఖ్యంగా పోటీ పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు తీసుకొస్తామని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని తెలిపారు.

సంస్కరణలకు సంబం ధించిన ఐదు అంశాలపై అధ్యయనం చేసి మరోసారి సీజేపీ ప్రతినిధులతో చర్చిస్తామని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు కేసుల పేరుతో ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకుంటామని, నీట్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.