6 May, 2026 | 10:00 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

రాబోయే మూడేళ్లలో అశ్వారావుపేటను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

26-02-2026 12:06 AM

ఎమ్మెల్యే జారె

అశ్వారావుపేట, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): రాబోయే మూడు ఏళ్లలో అశ్వారావుపేట నియోజకవర్గాన్ని ఆదర్శ  నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్థానిక శాసన సభ్యులు జారే ఆదినారాయణ తెలిపారు. బుధవారం అశ్వారావుపేట మండలంలో  ఆయన విస్తృతంగా పర్యటించారు.

వినాయకపురం, ఆసుపాక, నందిపాడు, కోయరంగాపురం, గుమ్మడపల్లి, బచ్చువారిగూడెం, నారాయణపురం, గాండ్లగూడెం, అనంతారం, మల్లాయి గూడెం, కేశప్పగూడెం, ఊట్లపల్లి, అశ్వారావుపేట మున్సిపాలిటీ, కొత్త నారవారిగూడెం, మద్దికొండ గ్రామ పంచాయితీల పరిధిలో వివిధ గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల పూర్తి చేసిన సీసీ రోడ్లను అధికారికంగా ప్రారంభించారు .కొత్తగా నిర్మించబోయే సీసీ రోడ్లకు శంకుస్థాపనలు  చేశారు.

కార్యక్రమంలో భాగంగా మండలంలోని స్వయం సహాయక సంఘా ల కోసం కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని రంగాలలో అశ్వారావుపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజక వర్గంగా  తీర్చిదిద్దటానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు, ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి ప్రమోద్, పంచాయతీరాజ్ డిఇ శ్రీధర్, ఏఈ అక్షిత, ఆర్డబ్ల్యూఎస్ డిఈ సలీం, ఏఈ సతీష్, అంగన్వాడీ అధికారులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.