17 June, 2026 | 8:37 PM

Breaking News

సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •   జల్ జీవన్ మిషన్‌తో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు   •  

నిరంతర నిఘాను కొనసాగిస్తాం

24-03-2026 12:25 AM

శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాట్లు: సీపీ సజ్జనార్ 

సికింద్రాబాద్, మార్చి 23(విజయక్రాంతి): శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రతిఏటా హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరాముని శోభాయాత్రను నిర్వహిస్తారు. ఈ సారి కూడా శోభయాత్రను నిర్వహించేందుకు సన్నాహలు ప్రారంభించారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉత్సవ కమిటీ నిర్వహకులతో సమావేశం అయ్యారు. నగరంలో శ్రీరాముని శోభయాత్రలో నిర్వాహకులు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని చెప్పారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ శ్రీరామ నవమి ఉత్సవ కమిటితో సమన్వయ సమావేశం నిర్వహించాం.16 ఏళ్లుగా శోభయాత్ర సమర్థవంతగా, విజయవంతంగా జరుగుతుంది. ఈ సారి కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం. అందరి సహకారంతో ఈ యాత్రను ప్రశాంతంగా సాగేల ఏర్పాట్లు చేస్తున్నాం. శోభాయాత్ర కమిటీ కొన్ని విషయాలను మా ముందు ఉంచారు. వాటిని పరిశీలిస్తాం అని ఆయన వెల్లడించారు.

అలానే ప్రభుత్వ, పోలీ స్ శాఖ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. శోభాయాత్రకు సుమారుగా 3000 మంది పోలీసులు భద్రత విధుల్లో ఉంటారు. చైన్ స్నాచింగ్, ఇతర ఘటనలు జరగకుండా క్రైమ్ టీమ్స్ ను, షీ టీంలను మోహరిస్తాం. శోభాయాత్ర జరిగే తీరును డ్రోన్లతో పర్యవేక్షిస్తామని, ఈ యాత్ర సాగే మార్గాలు సీసీ టీవీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా నిరంతర నిఘాని కొనసాగిస్తామన్నారు. గతేడాది వెహికల్ బ్రేక్డౌన్ కారణంగా శోభాయాత్ర నెమ్మదిం చింది. ఈసారి అలాంటి సమస్యలు లేకుండా శోభాయాత్రను అనుకున్న సమయానికి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం అని సీపీ సజ్జనా ర్ స్పష్టం చేశారు.