20-02-2026 01:28:44 AM
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
కడెం, ఫిబ్రవరి ౧9 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ ఉచిత విద్యుత్తు అందిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. కడెం మండలం గంగాపూర్ (దత్తోజీపేట) లో మూడు కోట్ల వ్యయమంతో నిర్మాణం చేపట్టనున్న 33/11 కెవి ఉప విద్యుత్తు సబ్ స్టేషన్ నిర్మాణానికి నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు,
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులతో కలసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అలాగే కుర్ర తండ జిపి పరిధిలో గల దుబ్బ తండాలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న అంగన్వాడీ భవనం పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భూషణ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.