20-02-2026 01:27:36 AM
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాం తి): ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలోచనల తో యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. గురువారం జిల్లా కేం ద్రంలోని శివాజీ చౌక్‌లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించిన శివాజీ మహారాజ్ ఆలోచనలు యువతలో దేశభక్తిని, క్రమశిక్షణను పెం పొందిస్తాయి. ఈ కార్యక్రమంలో ఆరే సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోలే బిక్కాజీ, సంఘం నాయకులు జీవన్, కమలాకర్, బీఆర్‌ఎస్ నాయకులు శ్రీధర్‌రెడ్డి, సంజీవ్ పాల్గొన్నారు.