17 July, 2026 | 4:49 PM

గురుకులాలు, వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలి

17-07-2026 04:41 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు మరియు వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందజేశారు.జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల్లో కనీస సౌకర్యాల లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రెబ్బెన సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల కళాశాలకు సొంత భవనం మంజూరు చేయాలని, అలాగే జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలకు కూడా శాశ్వత భవనం నిర్మించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, జిల్లా నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.