ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు అధికారుల తీరును వివరించిన సర్పంచ్
బెజ్జూర్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ బృందం రివ్యూ నిర్వహించింది.జిల్లా అధికారుల సమక్షంలో కమిషనర్ కి బెజ్జూర్ మండలం, తుమ్మలగూడ గ్రామపంచాయతీ, లుంబిని నగర్ గ్రామంలో 80 మంది రైతులు దాదాపు 40 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ నివాసం ఉంటున్నారు. వీరు 2010 లో ఐదవ భూ పంపిణీ ద్వారా 32 మంది రైతులకు పట్టాలు, మిగతా వారందరికీ పాహానీలు అందించడం జరిగింది.
వీటి ఆధారంగా 2012లో ఇందిరా జల ప్రభ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 9 వ్యవసాయ సాగు బోర్లు త్రీఫేస్ లైన్ కరెంటు సౌకర్యం కల్పించింది, ప్రభుత్వం ద్వారా పంట రుణాలు, పంట నష్టాలు, సబ్సిడీలు ఇతర అనేక ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూరడం జరిగింది. 2005 లోనే ఫారెస్ట్ వాళ్లు బౌండరీ వేయడం జరిగింది. రైతులు ఆ బౌండరీ దాటకూడదు అని బౌండరీ దాటి రైతులు సాగు చేయలేదు బౌండరీ లోపల ఉన్న భూములనే ఫారెస్ట్ వాళ్లు మొలకలు వేస్తామని చెప్పి బలగాలతో వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ రైతులను సాగు చేయకుండా అడ్డుకుంటున్నారు.
అలాగే లుంబినీ నగర్ గ్రామంలో స్కూల్ భవనం, సిసి రోడ్లు, విద్యుత్ దీపాలు, ఇందిరమ్మ ఇండ్లు, మొదలగు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి వచ్చినప్పటికీ ఈ సంవత్సరం నుంచే ఫారెస్ట్ అధికారులు సాగు చేయనీయకుండా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగనీయకుండా అడ్డుకుంటున్న విషయం కమిషనర్ అధికారుల ముందు వివరించగానే వెంటనే అధికారులకు అదే సభలో కమిషనర్ డిఎఫ్ఓకి రోడ్లు భవనాలు ఇండ్లు గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులు అడ్డుపడవద్దని ఆదేశించారు. ఫారెస్ట్ అధికారులు ప్రజాప్రతినిధులతో ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్న విషయంలో కమిషనర్ సీరియస్ వ్యవహరిస్తూ డిఎఫ్ఓకి అలాంటి వారిని వెంటనే కమిషనర్ ఆఫీస్ కి రావాల్సిందిగా తెలియజేశారు.
అలా ప్రవర్తించిన అధికారులను కమిషన్ తగిన చర్యలు తీసుకుంటూ అవసరమైతే సస్పెండ్ చేస్తామంటూ హెచ్చరించారు. ఎమ్మెల్సీ నిధులతో ఊర్లో మజురైన మురుము రోడ్లు, బోర్ వెల్స్ , వాష్ రూమ్ లు, సీసీ రోడ్లు, భవనాలు ప్రభుత్వం నిధులతో మంజూరైన కలెక్టర్ ప్రొసీడింగ్లు ఉన్నా సర్పంచ్ కి ఎలాంటి సూచనలు లేకుండా, ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఎత్తకుండా వేరే వాళ్లకు ఫోన్లు చేస్తూ అతిగా ప్రవర్తిస్తున్న తీరును ట్రాక్టర్ డ్రైవర్లకు జెసిబి డ్రైవర్లకు, బోర్ వెల్స్ డ్రైవర్లకు ,ఓనర్లకు ఫోన్లు చేసి మీ బండ్లను సీజ్ చేస్తాం వెంటనే వెళ్లిపోవాలంటూ అభివృద్ధిని అడ్డుకుంటున్న బెజ్జూరు రేంజ్, రెబ్బెన శివారులో బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సాగరిక పై కమిషనర్ కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.






