పారిశుద్ధ్య సిబ్బందికి పరిశుభ్రత కిట్లు పంపిణీ
17-07-2026 04:33 PM
బెజ్జంకి: బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి పరిశుభ్రత కిట్లు, అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిగుల్లా మోహన్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. వారికి అవసరమైన భద్రతా సామగ్రి, పరిశుభ్రత కిట్లు అందించడం ద్వారా విధులు మరింత సురక్షితంగా, సమర్థవంతంగా నిర్వహించగలరని తెలిపారు. గ్రామ ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శేషి వినీత్ గౌడ్, గ్రామ కార్యదర్శి రాకేష్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






