సర్ ఫక్రియను పరిశీలించిన శ్రీహరి రావు
నిర్మల్,(విజయక్రాంతి): లక్ష్మణచాంద మండలం కనకాపూర్, రాచపూర్, లక్ష్మంచాందా, మునిపెల్లి గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం పరిశీలించారు. బూత్ స్థాయిలో జరుగుతున్న నమోదు, సవరణ, మార్పులు, చేర్పుల ప్రక్రియను పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.
బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తిచేసిన రాచాపూర్ బిఎల్ఓలను మరియు బిఎల్ఏలను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు కొండు నరేష్ రెడ్డి, వయసు ఏఎంసీ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, అబ్బడి ప్రతాపరెడ్డి, రాచాపూర్ సర్పంచ్ మహేష్, ఎంబడి రాకేష్, గాజుల రవికుమార్, కొట్ట శేఖర్, గంగాధర్ గౌడ్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు






