21 May, 2026 | 3:01 AM

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

21-05-2026 01:26 AM

ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్

వరంగల్, మే 20 (విజయక్రాంతి): జాతీయ జనగణనలో కులాల వారీగా డేటా సేకరణను మినహాయించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్, రాష్ట్ర అధ్య క్షులు, పూలే ఆశయ సాధన సమితి (పాస్) తెలంగాణ అన్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మా ల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడి న త్రిసభ్య ధర్మాసనం సామాజిక సంక్షేమానికి చేసిన వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బి ల్లును పార్లమెంటులో ఆమోదించాలన్నారు.