calender_icon.png 9 February, 2026 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలను పరిష్కరించాం

08-02-2026 12:00:00 AM

కాలనీలు, మెయిన్ రోడ్లు తేడా లేకుండా అభివృద్ధి

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్, ఫిబ్రవరి7 (విజయక్రాంతి): పద్మారావు నగర్ లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలలో చాలా వరకు పరిష్కరించినట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నా రు. శనివారం పద్మారావు నగర్ పార్క్ సమీపంలో ని కేఎఫ్సి వద్ద 43 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ లైన్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలు, మెయిన్ రోడ్లు అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. కార్పొరేటర్ కుర్మ హేమలత, కవాడిగూడ డిసి పుష్పలత,వాటర్ వరక్స్ జిఎం వినోద్, డీజీఎం ఆశిష్, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.