calender_icon.png 11 February, 2026 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలి

11-02-2026 12:27:01 AM

అచ్చంపేట, ఫిబ్రవరి 10 :పది పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నాగర్ కర్నూల్ జి ల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ సూచించారు.మంగళవారం అచ్చంపేట పట్టణంలోని వివిధ పాఠశాలలను ఆయన తని ఖీ చేసి, పదో తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు.

సిలబస్ పూర్తి స్థితి, బోధన విధానం, మధ్యాహ్న భోజన పథకం అమలుపై సమీక్షించారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచేలా ప్రత్యేక క్లాసులు నిర్వహించి, నాణ్యమైన బో ధన అందించాలని సూచించారు. ప్రతి పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపా ధ్యాయులు సమిష్టిగా పనిచేయా లన్నారు.