30 July, 2026 | 8:08 PM

Breaking News

భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •   బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం   •   పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు   •   బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి   •   93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి   •  

పరీక్షలు అంటే భయం వీడాలి

05-03-2026 04:57 PM

నిర్మల్(విజయక్రాంతి): విద్యార్థులు పరీక్షలు అంటే భయం వీడాలని ప్రొఫెసర్ మధు అన్నారు. గురువారం మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు(10th class student) పరీక్షల ఒత్తిడి నివారణ మంచి మార్కులు ఎలా సాధించవచ్చు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. వారు పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి, ఎక్కువ మార్కులు సాధించాలంటే  ఏ విధంగా వ్రాయాలి అనే అంశాల పై వివరించారు.

అదే విధంగా పరీక్ష పత్రాన్ని క్షుణ్ణంగా మూడు సార్లు చదివి జవాబులు వ్రాయడానికి సిద్ధం కావాలని చెప్పారు.. ఈ సమయంలో శాఖాహార  మిత భోజనం చేయాలని  కోరారు. ఇంకా అనేక రకాల సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సంతోష్, ఉపాధ్యాయులు చట్ల శ్రీనివాస్ , సురేందర్,  మోరే శ్రీనివాస్, మసియుద్దీన్, ఆశా కిరణ్,విద్యారాణి, ముత్తన్న, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.