24 April, 2026 | 11:42 AM

Breaking News

సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి   •   అటెండర్ గా పనిచేసిన చోటే ప్రజా ప్రతినిధిగా సన్మానం   •   పాలేరులో ప్రజల ముంగిటకే 'ప్రజా దర్బార్'   •   మంథనిలో విషాదం.. వడదెబ్బతో సీనియర్ ఫోటోగ్రాఫర్ మృతి   •  

వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలి

24-04-2026 12:00 AM
  1. ఇంటర్ లో 100% ఉత్తీర్ణత పై హర్షం 
  2. హాసన్ పర్తి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకృష్ణ

హనుమకొండ టౌన్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): విద్యార్థులు వేసవి కాలాన్ని వృధా చేసుకోకుండా మైండ్ స్పార్క్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, ప్రతిరోజు గంట పాటు ప్రాక్టీస్ చేయాలని  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హసన్ పర్తి ప్రిన్సిపాల్ సుధాకృష్ణ అన్నారు. గురువారం హాసన్ పర్తి గురుకుల పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం సందర్భంగా ప్రిన్సిపాల్ సుధాకృష్ణ 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, పెన్నులు అందించి సత్కరించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ సుధాకృష్ణ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ లో 100 శాతం ఫలితాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తంచేశారు.

ఈఏడాది పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆర్జెసి సెట్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వలనే, తమ పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.