మొక్కలు నాటడం అలవాటుగా చేసుకోవాలి
26-08-2026 12:00 AM
సర్పంచ్ కేతావత్ వెంకటేష్ నాయక్
బాలానగర్, ఆగస్టు 25: మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలో మంగళవారం విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కేతావత్ వెంకటేష్ నాయక్ మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి, ఎంపీవో జైపాల్రెడ్డి, ఏఈవో ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ బాలు నాయక్, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






