14 July, 2026 | 4:45 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

04-11-2025 06:10 PM

సింగరేణి ఏరియా జయం రాధాకృష్ణ..

మందమర్రి (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా ఒక్కో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ కోరారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ఆవరణలో సింగరేణి విద్యార్థులతో కలిసి మంగళవారం వివిధ రకాల పూల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి మనుగడ మొక్కల మీద ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవతి జా, డీజీఎం ఈ&ఎం దూప్ సింగ్, డీజీఎం ఎఫ్ అండ్ ఏ ఆర్విఎస్ఆర్కె ప్రసాద్, సివిల్ ఎస్ఈ రాము, ఫారెస్ట్ అధికారి నవీన్ కుమార్, పర్యావరణాధికారి వెంకట్ రెడ్డి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారా యణ, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ సింగరేణి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.