18 July, 2026 | 2:33 AM

అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలి

18-07-2026 02:19 AM

జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్

కామారెడ్డి, జులై 17 (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు  సమన్వయంతో పనిచేయాలని దిశ కమిటీ చైర్మన్ జహి రాబాద్ పార్లమెంటు సభ్యుడు సురేష్ షెట్కార్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశం హాలులో  దిశా జిల్లా అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష ప్రభుత్వ పథకాల అమలులో సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎంపీ సురేష్ షెట్కర్ అన్నారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దిశ సమావేశాన్ని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో అం దించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పను లను వేగవంతం చేసి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.వ్యవసా యం, నీటిపారుదల, రహదారులు, రహదారి భద్రత, బ్యాంకింగ్, విద్య, గ్రామీణా భివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించి,

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించి, కిసాన్ క్రెడిట్ కార్డులు, పంట బీమా, ఇతర ఆర్థిక సహాయ పథకాల అమలును మరింత వేగవంతం చే యాలని పేర్కొన్నారు.జాతీయ రహదారులపై రహదారి ప్రమాదాల నివారణకు అవ సరమైన భద్రతా చర్యలను పటిష్టం చేయాలని, తాగునీరు, సాగునీటి సౌకర్యాల మెరు గుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అవసర మైన ప్రతిపాదనలు సిద్ధం చేసి, అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా విని యోగించాలని సూచించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తు త వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులకు ఆరుతడి పంటలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరికి ఉపాధి లభించేలా క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడు తూ జిల్లా అభివృద్ధికి తనవంతుగా సహకారం అందించి అభివృద్ధి పనులను వేగ వంతానికి కృషి చేస్తానని, ప్రజలకు కావలసిన మౌలిక వసతులను సంబంధిత శాఖ అధికారులు కల్పించాలన్నారు.

అనంతరంకలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ సమా వేశంలో సభ్యులు చేసిన సూచనలను సం బంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికతో అ మలు చేయాలని, శాఖల మధ్య సమన్వ యం పెంపొందించి అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, అదనపు కలెక్టర్ విక్టర్ అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ యన్‌వై.గిరి, డిఆర్‌డిఏ దామోదర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.