13 August, 2026 | 3:06 AM

కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయ సాధనకు పాటుపడాలి

13-08-2026 01:58 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), ఆగస్టు12: ప్రముఖ మార్కిస్ట్ రాజకీయ నాయకుడు,సీపీఎం పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయ సాధనకు ప్రతీఒక్కరు పాటుపడాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు.

కామ్రేడ్ సీతారాం ఏచూరి 74వ జయంతి సందర్భంగా బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలోని మల్లు స్వరాజ్యం స్మారక భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఏచూరి భారత కమ్యూనిస్టు ఉద్యమంలో చెరగని ముద్ర వేసిన గొప్ప నాయకుడని,విద్యార్థి ఉద్యమం నుంచి జాతీయస్థాయి కమ్యూనిస్టు నాయకత్వం వరకు ఆయన సాగించిన ప్రస్థానం అనేక తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.

సీపీఎం పార్టీ మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు,నెమ్మాది వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చెరుకు ఏకలక్ష్మి, మట్టిపల్లి సైదులు,కోట గోపి,నాయకులు పులుసు సత్యం,శంకర్ రెడ్డి,యాదగిరి,శిగ వెంకన్న,ఎల్లెంల అవిలయ్య,ఉప్పు సత్యనారాయణ,శ్రీకాంత్,వజ్జె వినయ్,సైదయ్య,కొమ్ము విజయ్,కడెం కుమార్, బూర్గుల ప్రభాకర్,వీరపాపయ్య,మద్ది రాజయ్య,గోపయ్య,శేఖర్,అబ్బులు తదితరులు పాల్గొన్నారు.