23 May, 2026 | 2:56 AM

ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

23-05-2026 01:46 AM

సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే 22:బహుజన విప్లవోద్యమ రాష్ట్ర నాయకుడు,తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మండారి ప్రభాకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ కోరారు.మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో శుక్రవారం ప్రభాకర్ 7వ వర్ధంతిని నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభాకర్ స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్న ఊరును,కన్నవారిని వదిలి దోపిడీ,పీడనలు లేని సమాజంకై పోరాడుతూ అమరుడైన ప్రభాకర్ త్యాగం మరువలేనిదన్నారు.దేశంలో కులాన్ని రూపుమాపాలని,కులరహిత సమాజం కావాలని ఆదర్శ వివాహం చేసుకున్న త్యాగధనుడు ప్రభాకర్ అన్నారు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి అక్రమ అరెస్టులు,జైలు జీవితాన్ని గడిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు పోరాడిన మలిదశ తెలంగాణ నాయకుడైన ప్రభాకర్ ప్రజల మదిలో ఎప్పుడు సజీవంగానే ఉంటాడన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య,ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్,ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు,నాయకులు చామకూరి మల్లేష్,నాగెల్లి సంపత్,జ్యోతుల లక్ష్మీనారాయణ,బండి యాదయ్య,లింగయ్య,ప్రభాకర్ కుమారుడు సిద్ధార్థ తదితరులు ఉన్నారు.