పేద విద్యార్థులకు అండగా నిలవాలి
ఎంఈవో రవిందర్ రాజు
కూకట్‌పల్లి, ఆగస్టు 25 (విజయక్రాంతి): యూత్ ఫర్ సేవా, ఓ సాఫ్ట్వేర్ సంస్థ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి ఉన్నత పాఠశాల విద్యా ర్థులకు బ్యాగుల పంపిణీ చేశారు. మంగళవారం ఉదయం పాఠశాల ఆవరణలో కూ కట్ పల్లి మండల విద్యాధికారి రవీందర్ రా జు ఆధ్వర్యంలో సుమారు 400 విద్యార్థులకు బ్యాగులను అందజేశారు. ఈ సందర్బంగా ఎం ఈ ఓ రవీందర్ రాజా మాట్లాడుతూ పేద మధ్యతరగతి చెందిన విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాల విద్యార్థులకు చేయితనందించడం అభినందనీయమన్నారు.
యూత్ సామాజిక సేవా కార్యక్రమంలో ముందుండి పేద విద్యార్థులకు అండగా నిలవాలని ఆయన కోరారు. స్వచ్ఛంద సంస్థల అందించే సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఉత్తమంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సేవా ప్రతినిధులు, సాఫ్ట్ ప్రతినిధులు, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.






