5 May, 2026 | 7:58 PM

భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం

05-05-2026 06:45 PM

హనుమకొండ,(విజయక్రాంతి): భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే "బాలమంగళం" ప్రధాన లక్ష్యమని కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ డిప్యూటీ రిజిస్ట్రార్, మాధవ స్మారక సమితి అధ్యక్షుడు డాక్టర్ కోదాటి సుధాకర్ రావు అన్నారు. మాధవ స్మారక సమితి వరంగల్ శాఖ మరియు కుటుంబ ప్రభోధన్, వరంగల్ విభాగ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేసవి బాలబాలికల శిబిరం బాలమంగళమంను మంగళవారం ఉదయం హనుమకొండ కాకాజీ కాలనీలోని శ్రీ వివేకానంద యోగ కేంద్రంలో డాక్టర్ కోదాటి సుధాకర్ రావు దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 

అనంతరం మాధవస్మారక సమితి ప్రధాన కార్యదర్శి దాస్యం రామానుజం అధ్యక్షతన జరిగిన సమావేశంలో డాక్టర్ కోదాటి సుధాకర్ రావు మాట్లాడుతూ పుస్తక జ్ఞానమే కాకుండా మన పూర్వీకులు అందించిన సంస్కృతిని, అనేక విషయాలను బాలబాలికలకు ఈ శిబిరంలో నేర్పిస్తామన్నారు. ఆటపాటలతో పాటు క్రమశిక్షణ, పెద్దలపట్ల గౌరవం, పెంపొందించుకోవడానికి శిబిరం ఉపయోగపడుతుందన్నారు. కథలు, శ్లోకాలు, యోగ, ఆసనాలు, సంస్కృతం వంటి అనేక అంశాల ద్వారా బాల బాలికలలో దాగి ఉన్న సృజనాత్మకతకు ఈ శిబిరంలో మెరుగు పెడతామన్నారు. దేశభక్తి, దైవభక్తి వారిలో పెంపొందిస్తామన్నారు. సెల్ఫోన్లకు, టీవీలకు బాల, బాలికలు పరిమితం కాకుండా ఈ శిబిరం దోహాదా పడుతుందన్నారు.