27 June, 2026 | 7:27 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ఏఐ, టెక్నాలజీపై పట్టు సాధించాలి

10-02-2026 12:00 AM
  1. గత ప్రశ్నపత్రాలను నెమరేసుకోవాలి 
  2. తగినంత నిద్రపోవాలి
  3. పరీక్షా పే చర్చలో విద్యార్థులకు ప్రధాని మోదీ సూచనలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: విద్యార్థులు సాంకేతికతకు బానిసలు కాకుండా, టెక్నాలజీపై పట్టు సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త సాంకేతికతలను ఉపయోగించుకోవాలన్నారు. మం చిగా పరీక్షలు రాయడానికి గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలని, తగినంత నిద్రపోవాలని మోదీ స్పష్టంచేశారు.

కోయంబత్తూరు, రాయ్‌పూర్, గౌహతి, గుజరాత్‌లో జరిగిన విద్యార్థులతో పరీక్షా పే చర్చ రెండో కార్యక్రమంలో ప్రదాని మోదీ సోమవారం మాట్లాడారు. కొంతమంది పిల్లలకు మొబైల్ ఫోన్లు యజమానులుగా మారాయని, వీటితోపాటు టెలివిజన్ స్క్రీన్స్‌ను చూడకుండా వారు ఆహారం కూడా తినలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త సాంకేతిక తలకు భయపడకుండా, వాటిని నోర్చుకుని, వాటి నైపుణ్యాల్లో రాటుదేలాలన్నారు. ‘పరీక్షలకు బాగా సిద్ధమైతే  మీరు ఎప్పుడూ ఒత్తిడికి గురికారని, రాత్రి ప్రశాంతంగా నిద్రపోతే రోజంతా ఉల్లాసంగా ఉంటారని మోదీ చెప్పారు. దేశంలోని 10,12వ తరగతి విద్యార్థులు కూడా వికసిత భారత్ 2047 కలను తమ మనసుల్లో మోయగలగడం చూసి తనకు చాలా సంతోషమేసిందన్నారు. ప్రతి విద్యార్థీ క్రమశిక్షణ అలవరుచకోవాలని పిలుపునిచ్చారు.