calender_icon.png 10 February, 2026 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సొమ్మును కాపాడలేరా?

10-02-2026 12:00:00 AM

  1. బ్యాంకర్ల వృత్తి నైపుణ్యాలు ఇవేనా?
  2. డిజిటల్ మోసాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
  3. అడ్డుకోవడానికి ఎస్‌ఓపీని సిద్ధం చేస్తున్నామన్న అటార్నీ జనరల్ 
  4. కస్టమర్ల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని బ్యాంకులకు ‘సుప్రీం’ ఆదేశాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కాయాకష్టం చేసి పొదుపు చేసుకున్న ప్రజల సొమ్మును కాపాడలేరా? ఖాతాల్లోని డబ్బును సైబర్ నేరగాళ్లు కొట్టేస్తున్నా బ్యాంకులు ఎందుకు మేల్కోవడం లేదు? బ్యాంకింగ్ రంగంలో వృత్తి నైపుణాద్య లు ఇవేనా? అనుమానాస్పద లావాదేవీలు జరిగినప్పుడు వాటిని నిలిపివేసి, కస్టమర్లను ఎందుకు అలర్ట్ చేయడం లేదు? అంటూ డిజిటల్ అరెస్ట్ మోసాలపై బ్యాంకుల వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిం ది.

బాధితులు తమ జీవితకాల కష్టాన్ని కోల్పోతున్నా బ్యాంకులు ఎందుకు సకాలంలో స్పం దించడం లేదని ప్రశ్నించింది. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడంలో బ్యాంకు లు విఫలమవుతున్నాయని ధ్వజమెత్తింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. వృద్ధ దంపతులు తమ పొదుపు మొత్తాన్ని పోగొట్టుకోవడం చాలా బాధాకరమని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.

బ్యాంకులు చూపిస్తున్న వృత్తి నైపుణ్యం ఇదేనా అంటూ న్యాయస్థానం నిలదీసింది. ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు కస్టమర్ల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించింది. అనుమా నాస్పద లావాదేవీలు జరిగినప్పుడు వాటిని నిలిపివేసి కస్టమర్లను ఎందుకు అలర్ట్ చేయ డం లేదని అడిగింది. అటు కేంద్ర హోం శాఖ, ఐటీ శాఖలు ఈ మోసాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై నివేదికలు సమర్పించా యి.

సైబర్ నేరాలను అడ్డుకోవడానికి ప్రత్యేక నియమావళిని (ఎస్‌ఓపీ) సిద్ధం చేస్తున్నట్లు అటార్నీ జనరల్ కోర్టుకు వివరించారు. బాధితుల నుంచి దాదాపు రూ.54 వేల కోట్లు విదే శాలకు తరలిపోయినట్లు సమాచారం ఉందని కోర్టు పేర్కొంది. ఇంత పెద్ద ఎత్తున సొమ్ము పోతున్నా రిజర్వ్ బ్యాంక్ కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.

సాధారణంగా తక్కువ లావాదేవీలు చేసే ఖాతాల నుంచి ఒక్కసారిగా భారీ మొత్తంలో నగదు బదిలీ అయితే బ్యాంకులు కచ్చితంగా గుర్తించాలని సూచించింది. జనవరి 2, 2026 న రూపొందించిన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని హోంశాఖను ఆదేశించిం ది. ఈ విషయంలో నాలుగు వారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని కోరుతూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

‘సర్’ను ఆపలేరు.. రాష్ట్రాలకు హెచ్చరిక

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్య లు చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ఎవరూ అడ్డుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి గడువును ఫిబ్రవరి 14 నుంచి మరో వారం రోజులు పొడి గించింది.

ఈ మేరకు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ సవరణ ప్రక్రియను సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ పిటిషన్ వేశారు. మైక్రో అబ్జర్వర్ల నియామకంలో అవకతవకలు జరుగుతు న్నాయని ఆమె ఆరోపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించ డం లేదని ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలిపింది. ఐదుసార్లు లేఖలు రాసినా అధికారులు వివరాలు పంపలేదని పేర్కొంది.

అందుకే తామే స్వయంగా మైక్రో అబ్జర్వర్లను నియమించాల్సి వచ్చిందని వివరిం చింది. ఫిబ్రవరి 4వ తేదీన కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఫిబ్రవరి 7వ తేదీ అర్ధరాత్రి వరకు పేర్లు పంపకపోవడంపై చీఫ్ జస్టిస్ అసహ నం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్‌మను సింఘ్వీ వాదనలు వినిపించారు.