1 July, 2026 | 7:57 PM

Breaking News

పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •  

మతోన్మాద పార్టీకి షాక్ ఇచ్చాం

18-02-2026 01:12 AM
  1. సెక్యులర్ పార్టీల మద్దతుతో మున్సిపల్ పీఠాన్ని గెలుచుకున్నాం

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేష్ జాదవ్

ఆదిలాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): సెక్యులర్ పార్టీల మద్దతుతో మున్సిపల్ పీఠం గెలుచుకుని, మతోన్మాద పార్టీకి షాక్ ఇచ్చామని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు నరేష్ జాదవ్, అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రె స్ పార్టీ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ విజయోత్సవ ర్యాలీలో కీలక నేతలందరితో కలిసి వారు పాల్గొన్నారు.

మంగళవారం డీసీసీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల గుండా కొనసాగింది. పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల జై కాంగ్రెస్ నినాదాలతో పట్టణ పురవీధులన్నీ మారుమ్రోగాయి. ర్యాలీలో దారి పొడువునా వాహనం పై నుండి మున్సిపల్ చైర్ పర్సన్ అనూష, పార్టీ నేతలు ప్రజలకు అభివాదం చేసారు.

కాంగ్రెస్ శ్రేణులు తమ నేతలను అభిమానంతో తమ భుజానికెత్తుకుని నృత్యాలు చేసారు.  అటు తనకు పదవి కట్టబెట్టిన బీఆర్‌ఎస్, ఎంఐఎం, స్వతంత్ర సభ్యులకు, కీలక పాత్ర పోషించిన నేతలకు నూతన ఛైర్పర్సన్ అనూష కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, నూతన కౌన్సిలర్ లు,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.