ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఎర్రుపాలెం మండలంలోని తెలంగాణ చిన్న తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరుగుతున్న మహా కుంభాభిషేకానికి యాత్రికుల సౌకర్యార్థం రైల్వే అధికారులు శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిలుపుదల చేయుటకు అంగీకారం తెలిపినట్లు స్థానిక స్టేషన్ మాస్టర్ తిరుపతిరావు బుధవారం తెలియజేశారు. ఈ అవకాశం ఈనెల మూడవ తారీకు రాత్రి వరకే ఉంటుందని స్థానికులు పరిసరాల వారు యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.
పర్మినెంట్గా ఆపుటకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని వారు తెలిపారు. తాత్కాలిక ఆపుదలకు రైల్వే ప్రయాణికుల సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి హనుమంతరావు కొప్పు రవికుమార్ స్థానిక జిల్లా రాష్ట్ర బిజెపి నాయకులు విశేష కృషి సల్పినందులకు మండల పరిసరాల ప్రాంతాల వారు వివిధ సంఘాల వారు కృతజ్ఞతలు తెలిపారు. శాశ్విత నిలుపుదలకు విశేష కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.






