కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం
01-07-2026 07:39 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు గ్రామ సర్పంచ్ గొల్ల అరుణ్ స్వామి యాదవ్ ప్రత్యేక చర్యలతో పరిష్కారం లభించింది. గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న బోరులో నూతన మోటారును ఏర్పాటు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో చాలా రోజులుగా నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులకు ఊరట లభించింది. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు రజినీకాంత్ రెడ్డి, నరేందర్, కర్రోళ్ల సిద్ధయ్యతో పాటు గ్రామ ప్రజలు పాల్గొని సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.






