1 July, 2026 | 6:43 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •  

ఇల్లెందు మున్సిపాలిటీ చైర్మన్‌గా దొడ్డ కిరణ్ మిత్ర ఎన్నిక

18-02-2026 01:10 AM

ఇల్లెందు, ఫిబ్రవరి 17, (విజయక్రాంతి): ఇల్లెందు మున్సిపల్ చైర్ పర్సన్ గా రెండవ వార్డు కౌన్సిలర్ దొడ్డ కిరణ్ మిత్రను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా 17వ వార్డు కౌన్సిలర్ పెండేల రాజు ఎన్నికయ్యారు. ఇల్లెందు మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో 24 వార్డులకు 19 కాంగ్రెస్ ’హస్త’గతం చేసుకోగా ఇండిపెండెంట్ లు ఇద్దరు, బిఆర్‌ఎస్ 3 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక జరగాల్సినప్పటికీ చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎంపిక విషయంలో పోటీ ఉండడంతో మంగళవారానికి వాయిదా పడింది. ఎమ్మెల్యే కోరం కనకయ్య చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎంపిక అధిష్టానం నిర్ణయిస్తుందని పేర్కొనడంతో అనేక ఊహాగానాలు నడుమ మంగళవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రశాంతంగా ముగిసింది. ఇల్లందు నూతన పాలక వర్గానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్లు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. నూతన సభ్యులచే ఆర్డీవో మధు ప్రమాణ స్వీకారం చేయించారు.