విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు
01-07-2026 07:34 PM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని మరల పెళ్లి గ్రామం రైతులు దాదాపు 50 ఎకరాలలో వేసిన సోయాబీన్ పంట కపోవడంతో గ్రామంలోని రైతులు ఆందోళన వ్యక్తపరిచారు రైతులకు జరిగిన అన్యాయాన్ని విజయక్రాంతి బహిర్గతం చేయడంతో వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం గ్రామానికి వెళ్లి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతుల పొలాల కు వెళ్లి మొలకెత్తిన విత్తన భూములను పరిశీలించారు. జరిగిన నష్టం వివరాలను సేకరించిన అధికారులు సంబంధిత డీలర్లతో కంపెనీ వారితో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామన్నారు






