సీనియర్ అసిస్టెంట్ యాదగిరి సార్ సేవలు మరువలేం
దివ్యాంగులకు... ఆయన చేసిన సేవలు అమోఘం
తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ
జవహర్ నగర్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఆముదాల యాదగిరి సేవలు మరువలేమని దివ్యాంగులకు ఆయన చేసిన సేవలు అమోఘమని తెలంగాణ వికలాంగుల హక్కుల జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్లోని డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఆముదాల యాదగిరి బుధవారం పదవి విరమణ చేయుచున్న సందర్భంగా తెలంగాణ వికలాంగుల హక్కుల జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ తదితరుల ఆధ్వర్యంలో యాదగిరి కి ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ పేదల మనిషి దివ్యాంగులకు ప్రతి నిమిషం అన్ని విషయాలలో సహాయం చేసే గుణం ఉన్నటువంటి యాదగిరి సార్ డిపార్ట్మెంట్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చి దివ్యాంగులకు సహాయం చేయడం ఆయన నైజం అన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు పదవి విరమణ చేయడం బాధాకరంగా ఉన్నా ఉద్యోగి తన బాధ్యతలు పరంగా పదవి విరమణ అనేది సహజమేనన్నారు. ఆముదాల యాదగిరి దివ్యాంగులకు జిల్లా కలెక్టరేట్లో చేసిన సహాయ సహకారాలు మరువలేమన్నారు. ఆయన పదవి విరమణ తర్వాత కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ దివ్యాంగుల తరఫున కోరుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఆముదాల యాదగిరికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శారద, వికలాంగుల హక్కుల సాధన సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






