17 March, 2026 | 9:52 PM

డ్యూటీ చేస్తా.. ఇబ్బందులు తొలగిస్తా..

17-03-2026 08:21 PM

ట్రాఫిక్ కానిస్టేబుల్ సిరికొండ అనిల్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తాను డ్యూటీ చేస్తూనే ప్రజల ఇబ్బందులను తొలగిస్తున్నానని  ట్రాఫిక్ కానిస్టేబుల్ సిరికొండ అనిల్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా పాయింట్ వద్ద కరీంనగర్ పెద్దపల్లి రహదారి పైన చాలా రోజుల క్రితం గుంత పడడంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.

ఇది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సిరికొండ అనిల్  సిమెంట్ తీసుకువచ్చి కంకర కలిపి పూడ్చి వేశారు. దీంతో ఆ దారి గుండా పోయే ప్రజలు వాహన చోదకులు అనిల్ ను అభినందించారు. గుంతలు కనిపిస్తే వెంటనే పూడ్చే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అనిల్ సూచించారు.