27 August, 2026 | 8:21 PM

లింగాపురం పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, స్టేషనరీ పంపిణీ

27-08-2026 04:41 PM

చర్ల, విజయక్రాంతి: చర్ల మండలం లింగాపురం ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ సామాగ్రి పంపిణీ చేశారు. దాత పరుచూరి మనోహర్ ప్రసాద్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. 

పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాండురాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మీకోసం మేమున్నాం టీం చైర్మన్ లయన్ నీలి ప్రకాష్, బండారి రామకృష్ణ, గొట్టిపాటి శ్రీనివాసరావు, దొడ్డి సూరిబాబు, వంగా సత్యనారాయణ, ఆవుల శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ తడికల నరేష్, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ స్వరూప, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు నరేంద్రబాబు, కొంగూరు సత్యం, తడికల విజయ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ.. తాను బాల్యంలో చదువుకున్న పాఠశాలను మరువకుండా గత 10 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఏదో ఒక సేవ అందిస్తున్న దాత పరుచూరి మనోహర్ ప్రసాద్ ను అభినందించారు. ప్రతి ఒక్కరూ స్పందించి తమ వంతుగా వెనుకబడిన ప్రాంతాల పాఠశాలలకు సేవలు అందించాలని కోరారు.