శ్రీ పెద్దమ్మ తల్లి భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
27-08-2026 04:37 PM
గణపురం,ఆగస్టు 27 (విజయ క్రాంతి): ఈ నెల 31న సోమవారం నిర్వహించనున్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావును ఆలయ కమిటీ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఆకుల సుభాష్(Akula Subhash) ముదిరాజ్, సర్పంచ్ పూజారి రాజేందర్ గౌడ్(Rajender Goud) మత్స్య సహకార సంఘం అధ్యక్షులు ఆకుల రాజయ్య, కమిటీ ఉపాధ్యక్షులు సాదు కరుణాకర్, ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణస్వామి, కుల పెద్దలు ఆకుల రవీందర్, కమిటీ సభ్యులు ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






