మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటి విడుదల
-ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రైతుల కృతజ్ఞతలు
కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట, కొండాపురం, బావుసాయిపేట, మామిడిపల్లి గ్రామాల పరిధిలో రైతులు వేసిన పంట పొలాలు భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులు ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసి మల్కపేట రిజర్వాయర్ నుంచి ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు.
ఆ నీరు గద్దగుట్ట చెరువు నుంచి వెంకట్రావుపేట, కొండాపురం మీదుగా మూల వాగులో కలవడం వల్ల భూగర్భ జలాలు పెరిగి పంటలకు ఉపశమనం కలుగుతుందని రైతులు తెలిపారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయించారు.
దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ వెంటనే స్పందించి నీటి విడుదలకు చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ గచ్చకాయల ఎల్లయ్య, కోనరావుపేట గ్రామ సర్పంచ్ మస్కూరి కాశిరాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు గొట్టె రుక్మిణి, బండ నరసయ్య యాదవ్, రవీందర్,రాస రవీందర్,దేవరకొండ నర్సించారి,మల్లేశం, మల్లయ్య, కుమ్మరి దేవదాస్, రైతులు పాల్గొన్నారు.




