28 July, 2026 | 1:01 AM

పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి

28-07-2026 12:17 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

ఢిల్లీలోని ఏపీ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో జాతీయ ఓబీసీ సదస్సు

ముషీరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఏపీ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన జాతీయ ఓబీసీ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ హయాంలోనే బీసీ బిల్లు సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బీసీల అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. సెమినార్‌లో పార్లమెంట్, స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, కులగణన, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, బీసీ రక్షణ చట్టం, క్రిమిలేయర్ రద్దు, బీసీ బడ్జెట్ పెంపు, బీసీ సబ్‌దీతిజిజిప్లాన్ అమలు తదితర 13 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఇన్‌చార్జ్ నూకాలమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భాస్కర్ శ్రీనివాస్, రమణ రాజు, వేణుగోపాల్, మల్లేష్ తో పాటు యాదవ్, శాలివాహన, గౌడ్, ముదిరాజ్, రజక, వడ్డెర, వంశరాజ్, విశ్వబ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, కాచి, మేరు, బీద మస్తాన్ రావు, నాగరాజు (కర్ణాటక), పాక సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, రామారావు (మహారాష్ట్ర) పాల్గొన్నారు.