దిశా కమిటీ సభ్యుడిగా మురళీకృష్ణ నాయక్
28-07-2026 12:18 AM
బూర్గంపాడు, జూలై 27,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశా కమిటీ స భ్యుడిగా బూర్గంపాడు మండలం అంజనాపురానికి చెందిన మురళీకృష్ణ నాయక్ నియ మితులయ్యారు. మహబూబాబాద్ ఎంపీ బ లరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచనల మేరకు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.
నియామకానంతరం సోమవారం జిల్లా కలెక్టర్ అంకిత్ను మర్యాదపూర్వకంగా కలిసి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వేణు గోపాల్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.






