సీఎం చొరవతోనే ‘జలమండలి’ సమస్యల పరిష్కారం
- ఐఎన్టీయూసీ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు, తెలంగాణ జలమండలి
- ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష అభ్యర్థి మొగుళ్ళ రాజిరెడ్డి
ముషీరాబాద్, మే 30 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే జలమండలి ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యాయని ఐఎన్టీయూసీ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు,తెలంగాణ జలమండలి ఎంప్లా యిస్ యూనియన్ అధ్యక్ష అభ్యర్థి మొగోల్ల రాజిరెడ్డి అన్నారు. హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్ జలమండలి డివిజన్ కార్యాలయంలో శనివారం జల మండలి గుర్తింపు సంఘం ఎన్నికల సందర్బంగా ఐఎన్టీయూసీ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు, తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ (టీజేఈ యూ) అధ్యక్ష అభ్యర్థి మొగుళ్ళ రాజిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉద్యో గ, కార్మికులను మర్యాదపూర్వకంగా కలసి తాను పరిష్కరించిన సమస్యలను వివరిస్తూ టీజేఈయూ త్రిశూలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.
అనంతరం వందలాదిమందితో జరిగిన భారీ బహిరంగ సభలో మొగుళ్ళ రాజిరెడ్డి మాట్లాడుతూ కార్మిక సంఘాల హక్కులను గౌరవిస్తూ తెలంగాణలోని జలమండలిలో గుర్తింపు సంఘం ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు.జూన్ 6న జరిగే జలమండలి గుర్తిపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ త్రిశూలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని మొగుళ్ళ రాజిరెడ్డి కోరారు. ఈ సభలో ఐఎన్టీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు జి. సత్యజిత్ రెడ్డి, టీజేఈయూ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ అల్లి శ్రవన్ కుమార్, వాటర్ వరక్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షుడు ఇ. చంద్రశేఖర్, మేవ అధ్యక్షులు సయ్యిద్ అక్తర్ అలీ, ఏఐటీయూసీ నాయకులు రమేష్, యూనియన్ నాయకులు బి.శంకర్ ప్రకాష్, బి. నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.






