31 July, 2026 | 6:07 PM

వేతన శ్రేణి (పే స్కేల్ )కోసం వీబీజీ రాo జి ఉద్యోగుల పెన్‌డౌన్, షట్‌డౌన్

31-07-2026 05:20 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మండలంలో వీబీజీ రామ్ జి కింద పనిచేస్తున్న ఉద్యోగులకు తగిన వేతన శ్రేణి (పే స్కేల్ ) మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నుంచి ఉద్యోగులు పెన్‌డౌన్ మరియు షట్‌డౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని వీబిజి రాం జీ ఉద్యోగ నాయకులు తెలిపారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... వివిధ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తూ, గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో నిరంతరం సేవలు అందిస్తున్నప్పటికీ, తమకు తగిన వేతన శ్రేణి లేకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్‌ను పరిశీలించి, తగిన పే స్కేల్ మంజూరు చేయాలని, ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించే వరకు శాంతియుతంగా తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని  స్పష్టం చేశారు.