వాకింగ్ ట్రాక్‌ను ప్రారంభించిన జీఎం శాలెం రాజు
కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి సామాజిక బాధ్యతలో మరో ముందడుగు వేసింది. రామవరం గణేష్ చమన్‌లో 400 మీటర్ల వాకింగ్ ట్రాక్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఎం.షాలెం రాజు గణేష్ చమన్ వద్ద సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో నిర్మించిన 400 మీటర్ల వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సింగరేణి సంస్థ ఈ వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేసిందన్నారు.
ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడంలో,నిత్య నడక (వాకింగ్) కీలక పాత్ర పోషిస్తుందని, ఎం. షాలెం రాజు అన్నారు. ఈ ట్రాక్ ఉదయం, సాయంత్రం వేళల్లో స్థానిక ప్రజలు, యువత, మహిళలు, వృద్ధులు నిత్యం వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పనలో సింగరేణి ఎల్లప్పుడూ ముందుంటుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.






