బస్సు వేళలు మార్చండి
31-07-2026 05:13 PM
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన మహాదుగూడ ,కేశవ్ గూడ, నాగు గూడ, తదితర గ్రామాలకు ప్రతిరోజు ఆర్టిసి బస్సును అధికారం నడుపుతున్నారు. అయితే ఈ రూట్లో నడుపుతున్న బస్సు సమయాలను విద్యార్థుల పాఠశాలల నిర్వహణకు అనుగుణంగా నడపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఉదయం పూట తొమ్మిది గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు పాఠశాల సమయానుకూలంగా నడపాలని కోరుతున్నారు. దీంతో విద్యార్థులు బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా మారుమూల గ్రామాలకు వెళుతున్న బస్సు సద్వినియోగం అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయా గ్రామాల వారు అంటున్నారు.






